18-02-2026 04:29:15 PM
జిల్లా కలెక్టర్ సత్య శారద
ఫిబ్రవరి 25 నుండి వార్షిక పరీక్షలు ప్రారంభం
వరంగల్,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వ హణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
జిల్లాలో 26 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం జనరల్ 5210, ఒకేషనల్ 793 మొత్తం 6003 విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5356, ఒకేషనల్ 807 మంది మొత్తం 6163 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు గాను జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్, 26 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్ మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
26 పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బంది, బందోబస్తుకు సైతం ఏర్పాట్లు, వార్షిక పరీక్షలకు గాను అన్ని పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి మరియు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలకు, ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల స్టోరేజ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెం. 9240205555 నెంబరును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సవేశంలో జిల్లా రెవెన్యూ అధికారు విజయ లక్ష్మీ , జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి శ్రీధర్ సుమన్,వైద్య ఆరోగ్య, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోస్టల్, ఇంటర్మీడియట్ విద్య, ఆర్టీసీ, సంబంధిత శాఖల తదితరులు పాల్గొన్నారు.