28 July, 2026 | 1:49 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి..

10-12-2025 07:24 PM

ఎంపీడీవో రఫిక్ ఉన్నిస బేగం..

కొల్చారం (విజయక్రాంతి): కొల్చారం మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని ఎంపీడీవో రఫిక్ ఉన్నిస బేగం సూచించారు. కొల్చారం మండల కేంద్రంలో బుధవారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.