calender_icon.png 15 May, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

23-04-2025 10:58:24 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జమ్మూకాశ్మిర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ మంచిర్యాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమణ మాట్లాడుతూ... దాడి వెనుక పాక్ లాస్కరే సంస్థ హస్తం ఉందని, ఈ ఉగ్రవాదుల దాడి దేశద్రోహుల చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశ్వేశ్వర రావు, కోశాధికారి డాక్టర్ స్వరూప రాణి, పట్టణంలోని వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.