calender_icon.png 15 May, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ రక్షణ కోసం ఎంపిక కావడం హర్షణీయం

24-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,ఏప్రిల్23( విజ యక్రాంతి): మారుమూల గిరిజన ప్రాంతం నుండి దేశ సేవ కోసం ఆర్మీలో ఎంపిక కావ డం హర్షణీయమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు అన్నారు. బుధవారం జైనూర్ మండల కేంద్రంలోనీ కేరళ గ్రామర్ పాఠశాల పూర్వ విద్యార్థి శివప్రసాద్ ఆర్మీలో ఉద్యోగం సాధించడంపై  అభినందించారు. శివ ప్రసా ద్ తల్లిదండ్రులకు శాలువాతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు ఫెరోస్ ఖాన్, వంజారి సంగం రాష్ట్ర నాయకులు డాక్టర్ గోపీనాథ్ గిత్తే, నాయకులు కొట్నక్ దౌలత్ రావు, పేం దూరు ప్రకాష్, షేక్ హైదర్, పాఠశాల కరస్పాండెంట్ షేక్ జమీల్, ప్రిన్సిపాల్ షేక్ అఖిల్, డైరెక్టర్ రిజ్వానా కౌసర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.