14 July, 2026 | 6:30 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

గంజాయి బ్యాచ్ హల్ చల్... ఐదు మంది అరెస్ట్

01-10-2024 02:04 PM

రాజేంద్రనగర్,(విజయక్రాంతి): మణికొండ మున్సిపల్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రాంగణంలో థార్ కార్ లో గంజాయి సేవిస్తున్న ఐదు మంది యువకులను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయం ప్రాంగణంలో మద్యం సేవించకూడదని స్థానికులు చెప్పడంతో గొడవకు దిగిన గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. గంజాయి బ్యాచ్ కి స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంజాయి మత్తులో స్థానికులను సదరు యువకులు చితకబాదారు. వాగ్వాదంలో గంజాయి బ్యాచ్ ని పట్టుకొని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.