మత్తు వదిలితేనే మనిషిగా గుర్తింపు
03-04-2026 05:45 PM
కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ తానూర్ మండలాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి గస్తీ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సైలు ఎసెలు ఆయా గ్రామాల్లో గంజాయి తాగిన విక్రయించిన జరగబోయే పరిణామాలను వివరించారు. గంజాయి మత్తును దూరంగా ఉంచి మనుషులుగా బతకాలని సూచించారు. గంజాయి తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆయా గ్రామాల్లో ఉన్న షాపులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.




