calender_icon.png 23 August, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2.12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

23-08-2025 12:00:43 AM

వివరాలు వెల్లడించిన ఇల్లందు డీఎస్పీ

టేకులపల్లి, ఆగస్టు 22,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. అక్రమంగా లారీలో తరలిస్తున్న రూ.2.12 కోట్ల విలువైన 425 కిలోల గంజాయిని టేకులపల్లి  పోలీసులు పట్టుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను తెలిపారు. శుక్రవారం టేకులపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. 

టేకులపల్లి ఎస్‌ఐ ఎ. రాజేందర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం టేకులపల్లి- రహదారిలో వెంకట్యాతండా గ్రామ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు.  ఆ సమయంలో అటుగా వచ్చినఆర్ జి 06 జిసి 0833 నెంబర్ కలిగిన లారీని తనిఖీ చేయగా అందులో రూ.2.12 కోట్ల విలువైన 425 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. నిందితులు ఒడిశాలో కొనుగోలు భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తున్నారు.

నిందితుల్లో ప్రభులాల్ గుర్జర్, శివరాజ్ గుర్జర్ పట్టుబడగా మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో  పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్న టేకులపల్లి ఎస్‌ఐ రాజేందర్, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్‌ఐ ప్రవీణ్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ ఏ రాజేందర్, బోడు ఎస్‌ఐ పి.శ్రీకాంత్,  పోలీస్ సిబ్బంది ఉన్నారు.