calender_icon.png 23 August, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులు ప్రారంభం

23-08-2025 12:01:23 AM

నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్, కాసుల బాలరాజ్ 

బాన్సువాడ, ఆగస్టు 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్  మండలంలో పనుల జాతర  కార్యక్రమము  రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. మండలంలోని విరాపూర్, స్తంభపూర్ . బీర్కూర్  తండా లలో   నూతనంగా నిర్మించే. అంగన్  వాడి  కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందిస్తూ  ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. ఈ   కార్యక్రమములో మాజీ మున్సిపల్  ఛైర్మెన్  గంగాధర్,  జిల్లా మైనారిటీ  అధ్యక్షులు  ఖలేఖ్, గోపాల్ రెడ్డి, మార్కెట్  కమిటీ  ఛైర్మెన్  శ్యామల, బీర్కూర్  మండల్  అధ్యక్షులు  బోయిని  శంకర్, జిల్లా  ప్రధాన  కార్యదర్శులు కాంత్ రెడ్డి,  మాజీ  ఎంపీపీ, రఘు,  విజయ్  ప్రకాష్, శశికాంత్, రాములు, నర్సన్న, ఆరీఫ్  సయ్యద్  మన్సూర్ , బారంగేడ్గి  శ్రీను, పాల్గొన్నారు.