నెమళ్ల ఆర్తనాదాలు వినిపిస్తలేవా..?
బీఆర్ ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శశిపాల్
చేవెళ్ల, మార్చి 31:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శశిపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హెచ్సీయూలో వన్యప్రాణులు ఉన్నాయా.. అని వెటకారంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి నెమళ్లు, పక్షుల ఆర్థనాదాలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
హెచ్సీయూ పరిసరాల్లో 400 ఎకరాల్లో విస్తరించిన ప్రకృతి సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. అక్కడ వేల సంఖ్యలో నెమళ్లు, పక్షులు, జింకలు, అరుదైన చెట్లు, నీటి వనరులు ఉన్నాయని, చెట్లను నరికేస్తుంటే వన్యప్రాణులు ఆర్థనాదాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్సీయూ విద్యార్థులు భూములు, వన్యప్రాణులను కాపాడేందుకు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే పోలీసులతో కొట్టించి అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్య క్తం చేశారు. యూనివర్సిటీలను కాపాడతామని చెప్పే రాహుల్ గాంధీ ఈ విషయంపై వెంటనే స్పందించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్కు గుండెకాయ లాంటి హెచ్సీయూని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపు నిచ్చారు.






