28 June, 2026 | 1:45 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలి

01-04-2025 01:49 AM

 గ్రామస్థుల డిమాండః

నాగారం, మార్చి 31 : నాగారం మండల పరిధిలోని వర్తమానుకోట పాటి మీద గూడెం లో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమిస్తూ ఇంటి నిర్మాణం చేపట్టడంతో అదే కాలనీలో నివాసముంటున్న గ్రామస్తులు సోమవారం స్వీయ నిర్బంధనం చేసుకొని వినూతన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వీధి రెండు చివర్లను కంపచెట్లతో మూసివేశారు.

అనంతరం మాట్లాడుతూ రవాణా సౌకర్యం కోసం వీధిలో నివాసం ఉంటున్న వారు ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు రెండు ఫీట్ల స్థలాన్ని రోడ్డుకు వదిలేసి నిర్మాణం చేపట్టినామని తెలిపారు. కానీ బుర్ర సత్తయ్య అనే వ్యక్తి రోడ్డుని రెండు ఫీట్లు ఆక్రమిస్తూ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. దీంతో వీధిలో సిసి రోడ్డు మురికి కాల్వ నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇట్టి విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పంచాయతీ కార్యదర్శి ఎంపీడీవో కి ఫిర్యాదు చేసినామని వారు తెలిపారు. ఇట్టి విషయం పై విచారణ చేపట్టిన ఎంపీడీవో నామమాత్రపు విచారణ చేసి ఆక్రమణదారునికి వత్తాసు పలకడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వీధి ఆక్రమణను అడ్డుకోవాలని కోరారు.

రోడ్డు ఆక్రమణకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.రోడ్డు ఆక్రమణ పై వెంటనే చర్యలు తీసుకోకపోతే ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో  వారు కొమురెల్లి  బిక్షం .  లచ్చయ్య లింగయ్య  పూలయ్య. మల్లయ్య   లచ్చయ్య.  సురేష్  లింగయ్య  మధు  ఉప్పలయ్య కీరష్ణారెడ్డి.  మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.