28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి

01-04-2025 01:52 AM

ఇబ్రహీంపట్నం, మార్చి 31 (విజయ క్రాంతి):తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన పాశం బుచ్చయ్య గౌడ్ (65) రోజు మాదిరిగా కల్లు తీసేందుకు సోమవారం ఉదయం తాటిచెట్టు పైకి ఎక్కి, ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుతున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.