23 June, 2026 | 1:32 AM

పారా అథ్లెట్లకు సమర్థ్ పారా స్పోర్ట్స్ ప్రోగ్రాం

23-06-2026 12:00 AM

న్యూఢిల్లీ, జూన్ 22 : పారా అథ్లెట్లను ప్రోత్సహించేందుకు హ్యూండాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్(హెచ్‌ఎంఆఎఫ్), గో స్పోర్ట్స్ ఫౌండే షన్ ఆధ్వర్యంలో సమర్థ్ పారా స్పోర్ట్స్ ప్రోగ్రాం 2026 దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశ వ్యాప్తంగా నైపుణ్యం ఉన్న పారా అథ్లెట్లకు సుధీర్ఘకాలం శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

గత రెండేళ్లుగా సమర్థ్ పారా స్పోర్ట్స్ ప్రోగ్రాం కింద పలువురు పారా అథ్లెట్లకు గో స్పోర్ట్స్, హ్యూండాయ్ శిక్షణ ఇవ్వగా వారంతా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా స్విమ్మింగ్, పారా ఆర్చరీ, వీల్‌ఛైర్ టెన్నిస్‌తో పాటు పారా కనోయి క్రీడల్లో పారా అథ్లెట్లకు ఈ కార్యక్రమం కింద హై ఫెర్ఫార్మెన్స్ శిక్షణ అందిస్తున్నారు.

2024లో ప్రారంభించిన సమర్థ్ పారా స్పోర్ట్స్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ పొం దిన అథ్లెట్లు 52 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలతో సహా మొత్తం 114 మెడల్స్ సాధించారు. దీనిలో 66 అంతర్జాతీయ స్థాయి పతకాలున్నాయి. పారా అథ్లెట్ల కోసం తాము తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తుండడం సంతోషంగా ఉందని గో స్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈవో సగాటో బెనర్జీ, హ్యూండాయ్ మో టార్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. ఈ నెల 31 వరకూ దరఖాస్తులు స్వీకరించనుండగా జాతీయ స్థాయిలో పోటీల్లో కనీ సం ఒకసారి టాప్ 3లో నిలిచిన పారా అథ్లెట్లను అర్హులుగా నిర్ణయించారు.