11 May, 2026 | 2:18 AM

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

25-04-2024 01:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సాన్ని సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విద్యుత్తు ట్రాన్స్‌ఫారాన్ని ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. బుధవారం తెల్లవారు జామున జూబ్లీహి ల్స్ రోడ్డు నంబర్ 36లో ఈ ప్రమా దం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారు లోపల ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రమా దం జరగలేదు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘట నా స్థలానికి చేరుకున్న పోలీసులు అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమా దం జరిగినట్టు నిర్ధారించారు. గతంలో ఇదే ప్రదేశంలో బౌన్సర్ తారక్ మృతిచెందాడు.