11 May, 2026 | 1:13 AM

బియ్యం గిడ్డంగిలో రికార్డులు పరిశీలన

25-04-2024 01:21 AM

మహేశ్వరం,ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఉండేందుకు నిరంత రం నిఘా వ్యవస్థ పని చేస్తుందని పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలో రావిర్యాలలో బియ్యం నిల్వచేసే గిడ్డంగిలో విజిలెన్స్ బృందంతో కలిసి పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. గిడ్డంగిలో ఉన్న రికార్డులను పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అధికారులు, మిల్లర్లు సవ్యంగా నిర్వర్తిస్తున్నారా.. లేదా అనే సందేహలను నివృత్తి చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు శశిధర్, రాజు పాల్గొన్నారు.