22 June, 2026 | 2:58 AM

చెట్టు కూలి కారు ధ్వంసం

22-06-2026 12:00 AM

కూకట్ పల్లి, జూన్ 21 (విజయక్రాంతి): భారీ వృక్షం కూలి కారు ధ్వంసం అయిన సంఘటన ఆదివారం వివేకానంద నగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం ఆదివారం సాయంత్రం 4 గం టల ప్రాంతంలో వివేకానంద నగర్ కాలనీ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఆ సమయంలో ఆ చెట్టు కింద  సుజుకి గ్రాండ్ విటారా కారు నిలిచి ఉండడంతో ఆ కారుపై చెట్టు పడింది.

చెట్టు కారపై పడడంతో నిలిచి ఉన్న కారు ధ్వంసం అయింది. ఆ కారులోఎవరూ లేకపోవడం, ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందిని స్థానికులు తెలిపారు. చాలా సంవత్సరాల క్రితం కాలనీ లేఅవుట్ వేసిన సమయంలో నాటిన వృక్షాలు ప్రస్తుతం పెద్దపెద్ద చెట్లుగా మారి గాలి వానలకు కూలిపోతున్నాయని ప్రభుత్వం స్పం దించి కూలిపోయే స్థితిలో ఉన్న వృక్షాలను తొలగించాలని సూచిస్తున్నారు.