వికసించిన మే పుష్పం
18-05-2026 12:00 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఏడాది కోమారు.. అది కూడా సరిగ్గా మే నెలలో అంకురించి, పది రోజులపాటు వికసించి ఉండే అరుదైన మే పుష్పం తన అపూర్వ ఆకృతితో ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్ధులను చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని బండి సంపత్ ఇంట్లో విరబూసిన అరుదైన ‘మే’ పుష్పం ఆహ్లాదకరమైన ఆకృతి, మనసును హత్తుకునే అందంతో ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.






