12-11-2025 12:18:44 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్
- తాడ్వాయి, నవంబర్, 11( విజయ క్రాంతి ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్ వన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, కృష్ణాజివాడి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులు కోరారు.ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి గా మాట్లాడారు. మక్కలు ఎన్ని నెలల లో పంట దిగుబడి వస్తుందని వరితో పోలిస్తే మక్క పంట లాభ సాటిగా ఉంటుంధా అని రైతులను అడిగి తెలుసుకున్నారు మొక్కజొన్నలు పండిస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుందా అని అడిగారు.ఓ రైతు కలెక్టర్ తో మాట్లాడుతూ మక్క పంట దిగుబడి ద్వారా వరి కంటే లాభం పొందుతున్నాని తెలిపారు.
కలెక్టర్ రైతుల సూచనలు సేకరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, సిబ్బంది కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. జిల్లాలో మొత్తం 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 13 కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించి 2149 క్వింటాళ్ల ను రైతులు నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్ర వద్ద ఓ చిన్న పిల్లవాడు కనిపించడంతో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపాలని సూచించారు. పిల్లలను అనవసరంగా బయటకు తీసుకురావద్దని తల్లిదండ్రులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటీ ట్రైన్ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్,డిసిఓ రామ్మోహన్, తహాసిల్దార్ శ్వేతా, ఎంపీడీవో సాజిద్ అలీ, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.