12-11-2025 12:20:42 AM
బీజేపీ, బీఆర్‌ఎస్ తీరుపై డీసీసీబీ చైర్మన్ మండిపాటు
ఆదిలాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ధర్నా చేయడం హాస్యాస్ప దంగా ఉందని కాంగ్రెస్ నాయకులు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిచేయలేదని ధర్నా చేసిన బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేసారు. స్థానిక ఎమ్మెల్యేగా తను గెలిస్తే తేమ తో సంబంధం లేకుండా పత్తిని కొనిపిస్తానని రైతుల కిచ్చిన మాట ఏమైందని ప్రశ్నిం చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ పార్టీనే కదా మరి ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐ తో మాట్లాడి ఎందుకు రైతుల సమస్యలు పరిష్కరించడంలేదని అన్నారు. కపాస్ కిసాన్ యాప్ తెచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. అటు స్థానిక ఎన్నికల్లో రైతులను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు ప్రేమను నటించి ధర్నాల పేరుతో నాటక మాడుతుందని విమర్శించారు. మొన్నటి బీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ ఇంటి ముట్టడి సరికాదన్నారు.
మరి ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఎందు కు చేయలేదని ప్రశ్నించారు. దీంతో జోగు రామన్న, పాయల్ శంకర్ ఒక్కటే అన్నది రుజువవుతందన్నారు. జూబ్లిహిల్స్ ఫలితాల తో బీఆర్‌ఎస్, బీజేపీల బలమెంతో తేలిపోతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిగెల నర్సింగ్, లోక ప్రవీణ్ రెడ్డి , శ్రీలేఖ, మొయిన్ అహ్మద్ ,సిరాజ్, తౌసీఖ్ అహ్మద్, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.