12-11-2025 12:17:16 AM
మరచిన వేలం.. సింగరేణి ఆదాయానికి గండి...
అధికారులకెంత ముట్టాయో..?
కార్పొరేట్ అధికారుల మౌనంలో మర్మమేంటి...!
విజిలెన్స్ జాడ ఎక్కడ?
బెల్లంపల్లి అర్బన్ నవంబర్ 11 : సింగరేణిలో కొందరు అధికారుల చర్యలతో అవినీతి మూడు పూలు.., ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది... వారి బాధ్యతారాహిత్యం సింగరేణికి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. అలాంటిదే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 500 సింగరేణి దుకాణాల కుంభకోణం ఒకటి... సింగరేణి వ్యాపార సముదాయంలో భారీ అవినీతి, ఆశ్రిత పక్షపాతం వెలుగు చూసిందనడంలో ఎలాంటి సందేహం లేదు... అలాంటిదేమీ లేకపోతే సింగరేణి దుకాణాలను ఇంతకాలం నుంచి అధికారులు ఎందుకోదిలోసినట్టు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి...
సింగరేణి కార్పొరేట్ కంపెనీ అధికారులు మరిచిపోయి నా.. గతి తప్పిన బెల్లంపల్లి సింగరేణి వ్యాపార సముదాయాన్నీ ప్రజల పక్షాన నిలబడిన ‘విజయక్రాంతి’ నిఘా నేత్రం నుంచి ఎవరూ తప్పించుకోవడం, వీగిపోవడం కల్ల...! చేతు లు మారిన.., సింగరేణి మ్యాప్ నుంచి కనుమరుగైన బెల్లంపల్లి సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ భారీ అవినీతి చరిత్రపై ప్రత్యేక కథనం..
నడిబొడ్డున సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్...
బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున సింగరేణి కాంప్లెక్స్ ను నెలకొల్పారు. బొగ్గు గనుల ఆవిర్భావం తర్వాత పట్టణ ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం సింగరేణి కంపెనీ భారీ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించింది. సుమారుగా 500 వరకు దుకాణాలను ఏర్పాటు చేశారు. మెయిన్ బజారులోని సింగరేణి సూపర్ బజార్ పక్కన టీ స్టాల్ నుంచి భగత్ సింగ్ స్ట్రాచు స్టూడియో వరకు, అలాగే వెనుక వైపు సైతం పదుల సంఖ్యలో దుకాణాలున్నాయి.
సాయి శంకర్ బట్టల దుకాణం ముందు, పాతమటన్, కూరగాల మార్కెట్ ఇతర సముదాయం ఉంది. మజీద్ కాంప్లెక్స్ పక్కన నుంచి హైటెక్ టీస్టాల్ వరకూ ఉన్న దుకాణాలు, బాంబే డైయింగ్ పక్క లైన్‌లోనీ కిరాణ దుకాణాలు, వాటి వెను క సమీపంలో పాత టైలరింగ్ సముదాయం కూడా సింగరేణి సంస్థకు చెందినదే. ఈ దుకాణాలను సింగరేణి యాజమాన్యం వేలం వేసి అప్పగిస్తుండేది. అందుకు సంబంధిత వ్యాపారులు సింగరేణికి అద్దె చెల్లించేవారు. ఇలా షాపులు వెలసిన తర్వాత దశాబ్దాల కాలం వరకు వేలం ప్రక్రియ కొనసాగింది.
30 ఏండ్ల నుంచి నిలిచిన వేలం...
బెల్లంపల్లిలో సింగరేణి షాపుల వేలం 30 ఏండ్లుగా నిలిచిపోయింది. 2002లో బెల్లంపల్లిలో జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం గోలేటికి మారేంత వరకు సింగరేణి యాజమాన్యం దుకాణాలను వేలం వేసి వ్యాపారు లకు ఇచ్చేది. ఎప్పుడైతే జీఎం ఆఫీస్ గోలేటి కి తరలిపోయిందో ఇక అప్పటి నుంచి దుకాణాల వేలం నిలిచిపోయింది. సింగరేణి అధికా రులు దుకాణాలను పూర్తిగా విస్మరించారు.
దీంతో అప్పటి వరకు ప్రతి సంవత్సరం వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని యాజమాన్యం భారీగా కోల్పోయింది. మరోవైపు ఆ దుకాణాలను సింగరేణి యాజమాన్యం స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేంది. దీనితో అప్పటి వరకు ఎవరి నిర్వహణలలో ఉన్నా యో వారి చేతుల్లోనే దుకాణాలన్నీ కబ్జాకు గురయ్యాయి. అందుకు అధికారుల చేతులను బారీగానే తడిపినట్లు ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పాత కూరగాయల మార్కెట్ మాయం
చారిత్రాత్మకమైనా మటన్, కూరగాయల మార్కెట్ కూడా వ్యాపారుల పాలైంది. కూరగాల మార్కెట్, సాయి శంకర్ క్లాత్ మర్చంట్ ముందు దుకాణాలు మాయమై పోయాయి. వాటి స్థానంలో కొత్త భవనాలు వెలిశాయి. పాత మటన్ మార్కెట్ రూపం మాత్రం మారకుండా అలాగే ఉంది. ఇది కూడా మాంసం వ్యాపారులకు సొంతమైంది.
వ్యాపారులకు దారదత్తం..
రాజుల పైసా రాళ్లపాలనట్టు.. సింగరేణికి చెందిన కోట్ల విలువ చేసే వ్యాపార దుకాణా లు వ్యాపారులకు కొందరు అవినీతి అధికారులు దారాదత్తం చేశారు. నిర్వహణ బాధ్యత నుంచి అధికారులు తప్పుకున్నారు. కోట్ల విలువైన వ్యాపార సముదాయం వ్యాపారుల కబంధ హస్తాల్లోనే ఇప్పటికీ ఉండిపోయింది. సింగరేణి యజమాన్యం ఆ షాపుల ఊసే ఎత్తడం లేదు.
దీనిని అవకాశంగా చేసుకున్న వ్యాపారులు పాత దుకాణాలను కూలగొట్టి కొత్తగా అందమైన దుకాణ సముదాయాలను పర్మినెంట్ గా నిర్మించుకున్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కనిపించే వ్యాపార సముదాయం దర్పం నిత్యం కనిపించే దృశ్యం... ఈ దుకాణాలను సింగరేణి అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఇష్టారీతిన పర్మినెంట్ కట్టడాలను నెలకొల్పారు. 2010లో బెల్లంపల్లి జనరల్ మేనేజర్ గా పని చేసిన నాగయ్య హాయంలో నే సింగరేణి దుకాణాలు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. అప్పటి వరకు వేలం వేసి షాపులను ఇచ్చే వాటిని ఉచితంగా కట్టబెట్టా రు.
ఉచితంగా ఇచ్చారా..? అందుకు వ్యాపారస్తుల నుంచి భారీగా ముడుపులు తీసుకొని చేతులెత్తారా..? అనే అనుమానాలు ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయంశంగా మిగిలిపోయాయి. ఇక అప్పటి నుంచి కంపెనీ వేలం ఊసే ఎత్తకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి పుణ్యమాని అటు ఆదా యం.., ఇటు సింగరేణి ఆస్తులు దక్కకుండా పోయాయి. వ్యాపారస్తులకు ధారదత్తం అయిపోయాయి. కోట్ల విలువైన ఆస్తులు అత్త సొమ్ము.., అల్లుడు దానం... చేసిన విధంగా సింగరేణి దుకాణాలను ఆయనే వేలం వేసినంత పని చేశారు.
మారిన దుకాణాల రూపురేఖలు...
సింగరేణి షాపులను ఉత్త పుణ్యాన సొంతం చేసుకున్న వ్యాపారస్తులు ఎనలేని లబ్ది పొందుతున్నారు. ఆ షాపుల స్థానంలో కొత్తగా ఆధునికమైన భవనాలను నిర్మించుకున్నారు. మరి కొందరు పాత షాపులలోనే వ్యాపారాలు సాగిస్తున్నారు. సాయి శంకర్ దుకాణం స్థానం లో కొత్త భవనాలు వెలిశాయి. మటన్ మార్కె ట్ అలాగే ఉండిపోయింది. దాని పక్కనే గల కూరగాయల మార్కెట్ మాయమైపోయింది.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకొని వ్యాపారులు కిరాయికి ఇస్తున్నారు. మజీద్ కాంప్లెక్స్ పక్కన ఉన్న దుకాణాల రూపురేఖలు సైతం మారిపోయాయి. ఈ దుకాణాల్లో ఒకటి మున్సిపల్ మాజీ చైర్మన్ తన పలుకుబడిన ప్రయోగించి సింగరేణి నుంచి తీసుకొని ఆ తర్వాత విక్రయించాడనే ప్రచారం ఉంది. మజీద్ కాంప్లెక్స్ కి వెనుకవైపుగా చిన్న వ్యాపార సముదాయం కూడా ఉండేది.
అది కూడా చేతులు మారిపోయి సింగరేణికి దూరమైంది.. ఇలా సింగరే ణికి సంబంధించిన ఎంతో విలువైన 500 దుకాణాల స్థిరాస్తులు కొందరు అవినీతి అధికారులు ముడుపులకు కక్కుర్తిపడి వ్యాపార స్తుల పరం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
షాపులను ఇలానే వదిలేస్తారా...?
సింగరేణికి చెందిన కోట్ల విలువైన వ్యాపార సముదాయాన్నీ ఎంతకాలం ఇలా వదిలేస్తారనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పటిలాగే వేలం వేసి దుకాణాలను ఇవ్వాలంటు న్నారు. ఇలా షాపులను తిరిగి తీసుకోవడం వల్ల దీర్ఘ కాలంగా సింగరేణికి తగిన ఆదాయం వస్తోందని, అది సంస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ దిశగా సింగరేణి కంపె ని యోచించాలని కార్మికులు కోరుతున్నారు.
కార్మిక సంఘాలు ఎటువైపు..?
బెల్లంపల్లిలో చోటుచేసుకున్న వ్యాపార సముదాయంలో అవినీతి, కుంభకోణంపై కార్మిక సంఘాలు ఇకనైనా స్పందించాలి. ముఖ్యంగా గుర్తింపు, ప్రాతినిధ్య ఏఐటీయూసీ, ఐఎన్టియుసీ సంఘాలపై ఈ బాధ్యతా మరీ ఎక్కువ ఉంది. ముందుగా వారు ఎటువైపు అనే దానిపై కార్మికుల్లో ఆసక్తిగా చర్చ జరుగుతుంది. సింగరేణి షాపులను ఉత్తపుణ్యాన అప్పగించడంలో ఏరియా స్థాయి అధికారుల శక్తి సామర్ధ్యం సరిపోద్దా..?
అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేలా వారే ఈ పని చేస్తే..? కార్పొరేటు యాజమాన్యం ఎందుకు మౌ నంగా ఉందన్న విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రధాన సంఘాలపైనే ఉంది. ఈ విషయంలో ప్రతిపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు బెల్లంపల్లి ఆబాలగోపాలమంత ప్రశ్నించాల్సిన అవసరాన్నీ గుర్తించాలి. ఇలా ఒక్కతాటి పైకి వచ్చి సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి నడుం బిగించాలి.
షాపుల గల్లంతుపై విచారణ జరపాలి..
బెల్లంపల్లిలో సింగరేణి వ్యాపార సముదాయం గల్లంతుపై విచారణ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 500 షాపుల కుంభకోణంపై కార్పోరేటు యాజమాన్యం దృష్టి పెట్టాలని, షాపుల బదలా యింపులలో జరిగిన ముడుపుల వ్యవహారంపై సింగరేణి విజిలెన్స్ అధికారుల కన్ను ఎందుకు పడటం లేదనే చర్చ కార్మికుల్లో బలంగా జరుగుతుంది. సింగరేణిలో ప్రతి విషయం విజిలెన్స్ దృష్టికి వెళ్తుంది.
కానీ దుకాణాల వ్యవహారం వారి దృష్టికి వెళ్లకపోవడం ఏంటన్న ప్రశ్న అందరినీ వేది స్తుంది. బెల్లంపల్లి కేంద్రంగా చోటు చేసుకు న్న సింగరేణి వ్యాపార సముదాయ స్వాహా పై సింగరేణిలో అన్ని విభాగాల అధికారు లు సైతం చూసీ చూడనట్లు నటించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఈ విషయంలో అందరు శాఖాహారులే అయితే రొయ్యల ముల్లె ఎక్కడికి పోయిందన్న చం దంలా అధికారుల తీరును స్పష్టం చేస్తుంది.