25 July, 2026 | 10:49 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

11 మంది సెలబ్రిటీలపై కేసు

18-03-2025 12:00 AM

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పంజాగుట్ట పోలీసుల చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు పంజాగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారు. 11 మంది యూట్యూబ్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లపై సోమవారం కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేష్యాని సుప్రిత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది.