calender_icon.png 3 December, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా మట్టిని విక్రయించిన వ్యక్తులపై కేసు

03-12-2025 08:16:00 PM

ఒకరి అరెస్ట్..

సిద్దిపేట క్రైం: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని విక్రయించిన వ్యక్తులను అరెస్టు చేసినట్టు సిద్ధిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మిట్టపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెం.172 నుంచి మందపల్లి గ్రామనికి చెందిన పన్యాల గాంధీ రెడ్డి, మరికొందరు అక్రమంగా మట్టిని తరలించారని గ్రామ పరిపాలన అధికారి మహేష్ గత నెల 22న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మందపల్లి గ్రామనికి చెందిన గాంధీ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, పన్యాల రాజవెంకట్ రెడ్డి, గోనేపల్లి గ్రామనికి చెందిన శివరాత్రి రాజు, యాదగిరి, వెంకటేశం టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి ప్రైవేట్ కంపెనీలకు విక్రయించి డబ్బులు సంపాదించారని పరిశోధనలో తేలింది. నిందితులలో ఒకరైన గాంధీ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు.