calender_icon.png 3 December, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

03-12-2025 08:08:47 PM

దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు

మేడిపల్లి (విజయక్రాంతి): హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా యువ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది.

దీంతో మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లిలో వరంగల్ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.