calender_icon.png 9 December, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సిగరెట్లు అమ్మిన వ్యక్తిపై కేసు

09-12-2025 09:45:15 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేటలోని ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు సిగరెట్లు అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. వారం క్రితం బల్ల భాస్కర్ అనే వ్యాపారి పాఠశాల విద్యార్థులకు సిగరెట్లు అమ్ముతున్నాడని ప్రధానోపాధ్యాయుడు రాజప్రభాకర్ రెడ్డి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై వాసుదేవరావు తెలిపారు. మైనర్ బాలలకు మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులు అమ్మినట్టయితే  జువైనల్ జస్టిస్ చట్టం సెక్షన్ 77  ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు.