calender_icon.png 12 November, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం

03-12-2024 11:36:30 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం గ్రేటర్ పరిధిలో పలు అభివృద్ధి పనులను మొదలుపెట్టనున్నారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే అతి పెద్ద ఎస్టీపీని ప్రారభించనున్న సీఎం కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టబోయే ఆరు జంక్షన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. వరద నీటి సంపుల నిర్మాణాన్ని ఇవాళ సచివాలయం వద్ద ప్రారంభింనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న నీటి సంపులను, ఒక్కో సంపు సామర్థ్యం లక్ష్య లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు ఉంటుంది. వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపుల్లోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కలువల్లోకి మళ్లించనున్నారు. దీంతో వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు రోడ్లపై నిర్వకుండా, వాహనాదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చెక్ పెట్టేందుకే ఈ సంపులను ఏర్పాటు చేసున్నారు.