calender_icon.png 21 February, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభం కానున్న‘మెడికవర్’

21-02-2026 01:34:33 AM

ప్రారంభానికి ముందే అత్యవసర సేవల్లో హాస్పిటల్ పూర్తి సిద్ధత

ఎయిర్ అంబులెన్స్ భాగస్వామ్యంతో సమగ్ర క్రిటికల్ కేర్ ట్రాన్స్‌ఫర్ నెట్‌వర్క్ ఏర్పాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రారంభం కానున్న మెడికవర్ హాస్పిటల్, అధికారిక ప్రారంభానికి ముందే అత్యవసర వైద్య సేవల బలోపేతానికి కీలక ముందడుగు వేసింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో రోగుల అత్యవసర రవాణా,సమన్వయ సేవలను మెరుగుపరచేందుకు ఎవర్‌గ్రీన్ హెల్త్‌కేర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఆస్పత్రి ప్రారంభమైన తొలి రోజు నుంచే అత్యవసర పరిస్థితులను సమర్థంగా నిర్వహించే సమగ్ర వ్యవస్థ సిద్ధంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ అంబులెన్స్ సేవలు, రాష్ట్రాల మధ్య క్రిటికల్ కేర్ ట్రాన్స్‌ఫర్లు, క్లిష్టమైన,అత్యాధునిక చికిత్స అవసరమయ్యే కేసుల కోసం అంతర్జాతీయ రోగుల రవాణా వంటి సేవలు సమన్వయంతో అందించబడనున్నాయి. ప్రమా దాలు, గుండెపోటు, స్ట్రోక్, తీవ్రమైన గాయాలు, అవయవ వైఫల్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం అమూ ల్యం.

సమయానికి సరైన ఆస్పత్రికి రోగిని తరలించడం, మార్గమధ్యంలోనే నిపుణుల పర్యవేక్షణ అందించడం రోగి ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారుతుంది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నయన్ శ్రీరాముల మాట్లాడుతూ అత్యవసర వైద్యం ఆస్పత్రి గుమ్మం వద్ద ప్రారంభం కాదు అది సంఘటన చోటు వద్దే ప్రారంభమవుతుంది.

సమర్థవంతమైన ఎయిర్ అంబులెన్స్ వ్యవస్థలు, వేగవంతమైన క్లినికల్ సమన్వయం, నిరంతర వైద్య పర్యవేక్షణ రోగిని సరైన సమయంలో సరైన చికిత్సకు చేర్చడంలో అత్యంత ముఖ్యమైనవని తెలిపారు.ఈ భాగస్వామ్యాన్ని మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డేగ్లోర్కర్ ముందుండి సమన్వయం చేశారు. ఆస్పత్రి ప్రారంభానికి ముందే బలమైన అత్యవసర,  క్రిటికల్ కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, మెడికవర్ కేవలం ఒక ఆస్పత్రిని మాత్రమే కాదు, సమగ్ర వైద్య సేవల వ్యవస్థను నిర్మిస్తోంది.