15 June, 2026 | 2:18 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

25-03-2026 09:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తల్వేద  గ్రామంలో జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల 8 వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని గేదెలు, ఆవులు, దూడలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి ఒక అంటూ వ్యాధి, ఇది పీకోర్ణ వైరస్ వలన సోకుతుందని మన రాష్ట్రంలో ఎక్కువగా O,A,Aisa-1, అనే స్ట్రెన్ వల్ల విస్తరిస్తుందని ఈ వ్యాధి సోకడం వల్ల మరణాల శాతం తక్కువగా ఉన్న పశువుల్లో పాల ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి శక్తి సామర్థ్యం కుంటుపడుతుందని ఈ వ్యాధి తీవ్రత దేశవాళీ పశువుల కంటే సంకరజాతి పశువుల ఎక్కువగా ఉంటుందని పశువైద్యలు తెలిపారు.