calender_icon.png 2 December, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్‌పై సీబీఐ దర్యాప్తు

02-12-2025 01:38:33 AM

  1. అన్ని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన సుప్రీంకోర్టు
  2. ఏఐతో నేరస్థుల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ ఎందుకు ఫ్రీజ్ చేయడం లేదన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : డిజిటల్ అరెస్టులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇటీవల దేశవ్యాప్తంగా అనే క మంది బాధితుల నుంచి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సుప్రీంకోర్టు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ను ఆదేశించింది. ఇందుకు అన్ని రాష్ట్రాలూ సహకరించాలని తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును స్వయంగా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(సుమోటో పిల్)గా తీసుకుని విచారించింది.

రాజకీయాలకు అతీతంగా.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సీబీఐకి పూర్తి సహకారం అందించాలని తేల్చిచెప్పింది. డిజిటల్ అరెస్ట్ కేసుల్లో సమగ్రంగా దర్యాప్తు చేయడానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకు ఖాతాలు తెరిచి, స్కామ్‌లను సులభతరం చేయడాన్ని దుర్వినియోగం చేసిన కేసులలో అవినీతి నిరోధక చట్టం, 1988 ప్రకారం బ్యాంకర్లను విచారించడానికి సీబీఐకి స్వేచ్ఛ ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. సోషల్ మీడియా మధ్యవర్తులు సీబీఐకి పూర్తి సహకారాన్ని అందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు వారు అవసరమైనప్పుడల్లా సీబీఐ ఈ కేసులలో ఇంటర్పోల్ నుంచి సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. 

ఎఫ్‌ఐఆర్‌లు అప్పగించండి..

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్  వివరాలను, సమాచారాన్ని వెం టనే సీబీఐకి అందించాలని ఆదేశించింది. 

ఆర్బీఐకి నోటీసులు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కీలక ప్రశ్నలు సంధించింది. సైబర్ మోసాలకు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మె షిన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. కేవలం సైబర్ నేరగాళ్లే కాకుండా.. పౌ రులను మోసం చేయడంలో వారికి సహకరిస్తున్న బ్యాంకు అధికారులను సైతం గు ర్తించి చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూ చించింది.

సిమ్ కార్డులపై ఆంక్షలు..

సైబర్ నేరాలకు కేంద్ర బిందువుగా మా రుతున్న సిమ్ కార్డుల జారీపైనా కోర్టు సీరియస్ అయింది. ఒకే వ్యక్తికి అనేక సిమ్ కార్డు లు కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. 

తెలంగాణలో జనరల్ కన్సెంట్ కథ కంచికేనా..!

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు తెలంగాణకు అత్యంత కీలకం కానున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ర్టంలో సీబీఐ ఎంట్రీకి ఉన్న జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంది. దీంతో సీబీఐ రాష్ర్టంలో అడుగుపెట్టాలంటే రాష్ర్ట ప్రభుత్వ అనుమతి తప్పని సరి అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐని కోరినప్పటికీ, విధానప రంగా ఇంకా స్పష్టత లేదు. అయితే, సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో.. డిజిటల్ అరెస్టుల కేసుల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం సీబీఐకి సహకరించక తప్పని పరిస్థితి నెలకొంది.