28 June, 2026 | 2:09 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

దోచుకున్న ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలి

31-05-2025 02:32 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో కేసీఆర్ దోచుకున్న సొమ్ముపై ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ కోరాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ కోరితే కవితపై ప్రజలకు నమ్మకం ఏర్పడు తుందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న ప్పుడు దోచుకున్న సొమ్ములో వాటా కోసం కేసీఆర్ కుటుంబంలో పంచాయితీ నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో సామాజిక న్యా యం లేదనడంలో వాస్తవం లేదన్నారు.

బీజేపీ వాళ్లకు ప్యాకేజీలు ఇస్తే ఎవరితోనైనా స్నేహం చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యా ఖ్యల్లో వాస్తవం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లను బీఆర్‌ఎస్ గెలిపించిందన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీన మా? లేక అమ్మకమా? అనేది ప్రజలకు చెప్పాలన్నారు. ఆపరేషన్ సిం ధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు బీజేపీ ఎంపీలు పనికిరారని మోదీ అనుకుంటున్నారన్నారు.