కేజ్రీవాల్‌ను 5 రోజుల కస్టడీకి కోరిన సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ బుధవారం కీలక విషయాలు ప్రస్తావించింది. కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. ఢిల్లీ మద్యం కేసులో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలిని కోరింది. విచారణ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు. కరోనా రెండోదశ సమయంలో లిక్కర్ పాలసీని తెచ్చేందుకు ప్రయత్నించారని వెల్లడించింది. ఎక్సైజ్ పాలసీని త్వరగా తయారు చేయాలని అడిషనల్ సెక్రెటరీని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారని సీబీఐ స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించినట్లు తెలిపింది. ఎక్సైజ్ పాలసీ తయారవుతోన్న సమయంలోనే సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ ని కాంటాక్ట్ చేశారని సీబీఐ పేర్కొంది. సీబీఐ పిటిషన్ పై విచారణ పూర్తి కావడంతో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.






