27 July, 2026 | 2:14 AM

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

26-06-2024 06:38 PM

హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో బుధవారం సాయంత్రం చర్చలు జరిపిన జూనియర్ డాక్టర్లు చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల్లో జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేసిన 8 డిమాండ్ లలోఆరింటికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. మంత్రి సానుకూల స్పందనతో జూడాలు సమ్మెను విరమించారు. అంతకు ముందు తెలంగాణ సర్కారు రెండు జీవోలను జారీ చేసింది. 

ఉస్మానియా, గాంధీ ఆసుపత్తుల జూనియర్ డాక్టర్ల వసతి గృహాల నిర్మాణం, కాకతీయ వైద్య కాలేజీలో రహదారులు పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తూ జీవోను విడుదల చేసింది.ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి గృహాలు, రోడ్లకు రూ. 121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.