8 July, 2026 | 12:28 AM

అయోధ్య కానుకల చోరీపై సిబిఐ విచారణ జరపాలి

08-07-2026 12:00 AM

తొర్రూర్ లో సీపీఐ రాస్తారోకో

మహబూబాబాద్, జులై 7 (విజయక్రాంతి): అయోధ్య రామ మందిరం కానుకల చోరీపై వెంటనే సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో రామ మందిరం కానుకల చోరీపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరంలో పెద్ద ఎత్తున రామ భక్తుల కానుకల చోరీ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కుంభకోణం బయట పడినా నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. దేవాలయములో దోపిడీకి బీజేపీ బాధ్యత వహించాలన్నారు. హిందూత్వం పేరు చెప్పి ఆలయ సంపద దోపిడీ చేశారని, భక్తి ముసుగులో బీజేపీ నాయకుల గుడి దోపిడీ చూస్తే భక్తుల గుండె తరుక్కుపోతుందని, దేవాలయాలకి బీజేపీ తీరని అన్యాయం చేస్తున్నదన్నారు.

దేవుడి సొమ్ము దేవుడికే దక్కాలని, బీజేపీ దోపిడీని అడ్డుకుని ఆలయాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి, రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.అజయ్ సారధి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, ఓమ బిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేశ పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.