31 July, 2026 | 5:54 AM

కాళేశ్వరంపై విచారణకు సీబీ‘ఐ’

03-09-2025 12:51 AM
  1. రాష్ట్రంలో సీబీఐపై నిషేధాన్ని ఎత్తివేసిన రాష్ట్రసర్కార్
  2. ప్రాజెక్ట్ పరిధిలో అక్రమాల నిగ్గు తేల్చాలని ఉత్తర్వులు
  3. సీబీఐ చేతికి ఎన్డీఎస్‌ఏ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): తెలంగాణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ అధికారాన్ని నిషేధిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వులను సవరిస్తూ రాష్ట్రప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సీబీఐ రంగంలోకి దిగి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న అవకతవకలు, అవినీతి, అక్రమాలపై విచారించే వీలు కల్పించింది.

ప్రాజెక్ట్ పరిధిలోని మూడు బరాజ్‌ల పటి ష్టతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీ ఎస్‌ఏ) అందజేసిన నివేదికల ఆధారంగా లోతైన విచారణ చేపట్టాలని సీబీఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేది కతోపాటు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. ఆ నివేదికల ప్రకారం.. కాళే శ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 16, 17, 18, 19, 20, 21 పియర్స్ 2023 అక్టోబర్ 21న కుంగింది.

దీనిపై ప్రభుత్వం ఇదే ఏడాది అక్టోబర్ 10న ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ మేడిగడ్డ బరా జ్‌ను సందర్శించి, బరాజ్ కుంగడానికి కార ణాలను పరిశీలించింది. దీనిపై కమిటీ నివేది కను సిద్ధం చేసి ఇదే ఏడాది నవంబర్ 1న ప్రభుత్వానికి అందించింది. అలాగే గతేడాది మే నెలలో మధ్యంతర నివేదిక, ఈ ఏడాది ఏప్రిల్‌లో తుది నివేదిక అందించింది.

నిర్మాణంలో లోపాలు..

మేడిగడ్డ బరాజ్ కుంగడానికి డిజైన్లలో లోపాలు, నాణ్యతా లోపించడమే కారణ మని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 14న కమిషన్ ఆఫ్ ఎం క్వైరీగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ రంగంలోకి దిగి బరాజ్‌ల నిర్మాణంలో జరి గిన అవకతవకలు, అక్రమాలు, అవినీతిపై సుదీర్ఘమైన విచారణ చేపట్టింది.

అనంతరం కమిషన్ జూలై 31న తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ప్రాజెక్ట్ పరిధిలో అవినీతి, అక్రమాలు జరిగాయని గుర్తించి, బాధ్యులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. గత ప్రభుత్వ పెద్దలు ఎలాంటి ప్రణాళిక లేకుండా, తప్పుడు మార్గంలోనే మూడు బరాజ్‌లు నిర్మించినట్లు కమిషన్ తేల్చిచెప్పింది.

క్యాబినెట్ తీర్మానం.. అసెంబ్లీలో చర్చ..

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర క్యాబినెట్ గత నెల 8న ప్రత్యేక సమావేశం నిర్వహించింది. సమావే శంలో నివేదికపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం 31న శాసనసభలో కమిషన్ నివేదిక చర్చ పెట్టింది. చివరకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) పేర్కొన్న అంశాలతో పాటు కమిషన్ సిఫార్సులపై లోతైన విచారణ జరగాలని శాసనసభ నిర్ణ యించింది. ప్రాజెక్ట్ పరిధిలో అవినీతీ అక్రమాల నిగ్గు తేల్చాలని నిశ్చయించు కున్నది.

ప్రాజెక్టు విషయం అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడటం, రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు, పలు సంస్థలు,అనేక  ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉండడంతో విచారణ ప్రభుత్వం బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ప్రభుత్వం 2022లో రాష్ట్రంలో సీబీఐ ప్రవేశాన్ని నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ ఉత్తర్వుల కాపీ సీబీఐ కేంద్ర కార్యాలయానికి సైతం అందింది.