గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్, సెప్టెంబర్2(విజయక్రాంతి): గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సి పల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన మానకొండూ ర్ చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ పరిశీలించారు.
ఈ నెల 5న నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, తగిన సామర్థ్యంతో ఉ న్న క్రేన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మరమ్మతులు తక్షణం చేసేందుకు నిపుణులను అందుబాటులో ఉంచాలన్నా రు.
చెరువులో బోట్లను, ఈతగాళ్లను సిద్ధం గా ఉంచాలని సూచించారు. నిమజ్జన ప్రాం తాల్లో శానిటేషన్, తగినంత హై మాస్ట్ లై టింగ్, మంచినీటి సౌకర్యం, ఏర్పాట్లు ఉం డేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.కార్యక్రమంలో రెవిన్యూ డివి జనల్ అధికారి మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులుపాల్గొన్నారు.






