25 July, 2026 | 1:47 AM

అల్ఫోర్స్‌లో సీబీఎస్‌ఈ క్లస్టర్ 7 ఖో-ఖో పోటీల ప్రారంభం

25-07-2026 12:00 AM

కొత్తపల్లి, జూలై 24 (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో సీబీఎస్సీ క్లస్టర్ 7 ఖో-ఖో పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ముఖ్యఅతిథిగా హాజరై అడిషనల్ కలెక్టర్ డాక్టర్ అశ్విని తనాజీ వకాడే, అసిస్టెంట్ కలెక్టర్ పి.హరిప్రసాద్, రీజనల్ ఆఫీసర్ జంగం సునీల్ కుమార్, విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను, పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల దృష్టి సారించాలని తద్వారా వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు వ స్తుందని అన్నారు. విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, వాటిలో పాల్గొనడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీబీఎస్‌ఇ పరిశీలకులు భరత్ కుమార్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై మహేందర్ రావు, కరీంనగర్, తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ రెఫరీస్ బోర్డ్ కన్వీనర్ వి సూర్య ప్రకాష్, నాయకులు వాసాల రమేష్, వేముల చంద్రశేఖర్, డాక్టర్ కెప్టెన్ బి.మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.