30 June, 2026 | 7:54 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

అల్ఫోర్స్ హై స్కూల్ సుల్తానాబాద్ కు సీబీఎస్ఈ గుర్తింపు

12-05-2026 07:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ గత 14 సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలో విద్యార్థులకు సేవలు అందిస్తున్నామని, ఉత్తమమైన స్థానాలలో స్థిరపడేదందుకు కృషి చేస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు, సోమవారం సాయంత్రం  సుల్తానాబాద్ లోని అల్ఫోర్స్ హై స్కూల్ పాఠశాలకు ప్రతిష్టాత్మక సంస్థ సీబీఎస్ఈ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడారు.

సుల్తానాబాద్ పట్టణంలో అల్ఫోర్స్ హై స్కూల్ పాఠశాల గత 14 సంవత్సరాలుగా  అన్ని వర్గాల విద్యార్థులకు సేవలను అందిస్తూ మరియు చక్కటి ప్రణాళికల ద్వారా  చదువులోనే కాకుండా అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నామని వారు చెప్పారు. పాఠశాల సాధిస్తున్నటువంటి విధానం దృష్టిలో పెట్టుకొని మరియు రానున్నటువంటి రోజుల్లో మరనున్న విద్యా విధానాన్ని ఇప్పటినుండి అలవర్చడం, కేంద్ర సంస్థ అయిన సీబీఎస్ఈ నుండి గుర్తింపు రావడం చాలా హర్షించదగ్గ విషయమని పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను మరియు బోధనా సిబ్బంది దృష్టిలో పెట్టుకొని ఈ గుర్తింపు ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు.

విద్యార్థులకు ప్రాథమిక దశ నుండి నాణ్యమైన విద్యను అందిస్తూ నూతన విద్యా విధానానికి లోబడి చక్కటి విద్యను అందిస్తున్నామని వారు చెప్పారు,మరియు వారి యొక్క సృజనాత్మకతను,  నూతన విషయాలను కనుగొనేటువంటి సమర్థతను పెంపొందించవచ్చని వారు చెప్పారు.  విద్యార్థులకు అన్ని విధాలుగా అన్నివేళల్లో తోడ్పాటు అందించడానికి కృషి చేస్తుందని వారు చెప్పారు. ఇప్పటివరకు అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో రెండు సీబీఎస్ఈ పాఠశాలలు ఉన్నాయని ఇది మూడవదని వారు చెప్పారు.

సిబిఎస్ఈ గుర్తింపు రావడం పట్ల విద్యార్థులకు  పోటీ తత్వం పెరుగుతుందని, కమ్యూనికేషన్ స్కిల్స్ సైతం  మెరుగుపడతాయని ముఖ్యంగా జాతీయస్థాయి పని ఐఐటి మరియు నీటిలో భుజాన్ని సులువుగా సాధించడానికి దోహాదపడుతుందని వారు చెప్పారు,పెద్దపల్లి జిల్లాలో సైతం అగ్రగామిగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.  పాఠశాల యొక్క సీబీఎస్సీ అఫిలేషన్ నెంబర్ 3630668 అని చెప్పారు,అల్ఫోర్స్ విజయ పరిపాలన కొనసాగించడానికి భవిష్యత్తులో కొనసాగించడానికి  అందరి సాయి సహకారాలు అవసరమన్నారు.. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు...