12 May, 2026 | 8:42 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

12-05-2026 07:39 PM

చేగుంట,(విజయక్రాంతి)చేగుంట మండలం చందాయిపేట్ లోని శ్రీ భక్తాంజనేయ  ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు నర్సింహా మూర్తి, ఆలయ ధర్మ కర్త పబ్బ శ్రీనివాస్ గుప్త మాజీ ఎంపీటీసీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సుప్రబాత సేవ, మహా గణపతి పూజ, పుణ్యహ వాచనం, పంచామృత అభిషేకం, సింధూర లేపనం, సహస్ర నాగవల్లి దళపూజ (తమలపాకులతో), హనుమత్ హోమం, పూర్ణాహుతి, మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, మండలం లో ఉన్న పలు గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా పచ్చని తోరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పబ్బ నగేష్ గుప్త, మని గుప్త, చంద్రమౌళి గుప్తా, శోభన్, యాదగిరి, తుమ్మ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.