20 May, 2026 | 2:22 AM

అయ్యవారిపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

20-05-2026 01:18 AM

భిక్కనూర్, మే19 (విజయక్రాంతి): బిక్కనూర్ మండలం అయ్యవారిపల్లిలో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పనులకు శ్రీకారం చుట్టారు.

అనంతరం మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపం లేకుండా అధికారులు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు భీంరెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.