అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వా యుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముంద స్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లా స్ధాయిలో రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని నిరంతరం క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. గురువారం రెవెన్యూ, విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రా బోయే రెండు రోజుల్లో కురిసే వర్షాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల ప్రభా వం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ముందస్తు భద్రతాచర్యలు చేపట్టాలన్నారు.






