calender_icon.png 2 June, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యం

31-05-2025 10:23:51 PM

తొగుట సీఐ లతీఫ్

దౌల్తాబాద్ (విజయక్రాంతి): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని తొగుట సీఐ లతీఫ్(Thoguta CI Lateef) అన్నారు. శనివారం మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీసీ కెమెరాలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని అన్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన సీసీ కెమెరాలు ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు. సీసీ కెమెరాలు ఉండి పనిచేయని గ్రామాలల్లో, సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీరాం ప్రేమ్ దీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..