విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి.. ఉపాధ్యాయురాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఉపాధ్యాయురాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి తాళ్లపల్లి వినయ్
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాఘవాపురం పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాయం శ్రీవల్లిపై కర్రతో చేతితో వ్యక్తిగత కక్షలతో విద్యార్థిని పై దాడి చేయటం బాధాకరమనీ విద్యార్థినీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకి సమయపాలన పాటించడం లేదని,క్లాస్ రూమ్ లో ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని, ఉపాధ్యాయురాలు విద్య నేర్పకుండా పాఠశాల విలువలను కాల రాస్తుందని విద్యార్థిని తల్లిదండ్రులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆ విషయాన్ని ఉపాధ్యాయురాలు మనసులో పెట్టుకొని చదువు రావటం లేదు అనే నెపంతో విద్యార్థిని నీ కక్షపూరితంగా విచక్షణారహితంగా హింసించడం చాలా బాధాకరమన్నారు. ఇట్టి విషయంపై హెచ్ఎం, డీఈఓ, జిల్లా కలెక్టర్ కు నిష్పక్షపాతంగా విచారణ జరిపి సదురు ఉపాధ్యాయురాల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆళ్లపల్లి మండల సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నారు






