31 July, 2026 | 10:35 PM

శ్రీరామ హృదయం కలశం శోభాయాత్ర

31-07-2026 09:39 PM

కన్నేపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని జజ్జరవెల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర ప్రయుక్త శ్రీరామ హృదయం కలశాలను గ్రామ ప్రజలు పట్టుకొని ఊరేగింపుగా శోభాయాత్ర చేశారు. వికాస తరంగిణి కన్నెపల్లి మండల బాధ్యులు తాళ్లపల్లి రాజలింగు మాట్లాడుతూ... స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీరామ హృదయం కలశంను రోజుకి ఒక గ్రామం చొప్పున మండలంలోని ప్రతి గ్రామంలో శోభయాత్రగా తిప్పుతూ శ్రీరాముడి ఆశీస్సలు అందిస్తామని, మండలంలోని గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఇట్టి శోభయాత్రను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడుగురి శాంత చిన్నబాపు, జయన్న, రాజ్ కుమార్, రమేష్, మల్లేష్, లక్ష్మినారాయణ, సత్తన్న, సురేష్, మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.