31 July, 2026 | 10:06 PM

ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి

31-07-2026 09:34 PM

- ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

ఆర్మూర్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)లో ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఎజెంట్లదేనని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అర్మూర్ పట్టణంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల బిఎల్ఏ, సూపర్వైజర్ల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. వంద శాతం సర్ ప్రక్రియ పూర్తయ్యలా చూడాలని కోరారు. పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని సూచించారు.

ఆర్మూర్, బాల్కొండలో వంద శాతం ఓటు నమోదు చేయిస్తాని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇంచార్జ్ లు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించారు. అంతకు ముందు అర్మూర్ మున్సిపల్, ఎంపిడివో కార్యాలయాల్లో సర్ పై సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, అర్మూర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ పి.వినయ్  రెడ్డి, బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునిల్ రెడ్డి, నుడా  ఛైర్మన్ కేశ వేణు, తెలంగాణ మినరల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ  సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.