calender_icon.png 28 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రావణ మాసం బోనాలు

28-07-2025 01:32:54 AM

భోలక్‌పూర్‌లో పూజలు చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెన్ శ్రీనివాస్ రావు

ముషీరాబాద్, కాప్రా, జూలై 27 (విజయక్రాంతి): భోలక్ పూర్ రంగానగర్ లో ఆదివారం శ్రావణమాస బోనాలు వైభవంగా కొనసాగాయి. మహిళలు భక్తి శ్రద్ధల తో బోనాలను తీసుకువచ్చి నల్ల పోచమ్మ, భూలక్ష్మి దేవాలయాలలో అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్  ఎమ్మెల్యే ముఠా గో పాల్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు ముప్పిడి నర్సింగ్ రావు, నాగేష్ తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సాయంత్రం బ్యాండ్ మేళాలతో తొట్టెలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్, రంగానగర్ యువజన సేవా సంఘం ప్రధా న కార్యదర్శి వినోద్, కోశాధికారి ఎల్లేష్, నాయకులు మల్లేష్, రవికుమార్, నాగేష్, ధర్మేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కుషాయిగూడ పాత మార్కెట్లో..

కుషాయిగూడ పాత మార్కెట్ కాంటలో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి.

ఆరోగ్యం, శాంతి, సమృద్ధి నిండిన జీవితం అందరికి లభించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ నాయకులు మహేష్ గౌడ్, శివ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.