18-09-2025 01:33:47 AM
-బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రధాని మోదీ జన్మదిన వేడుకలతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్ల పురుషోత్తంరావు, శంకర్ యాదవ్, గోషామహల్ బిజెపి నాయకులు పాల్గొని జాతీయ పతాకానికి వందనాలు అర్పించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.