calender_icon.png 18 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చడమే మోదీ లక్ష్యం

18-09-2025 01:35:32 AM

హన్మకొండ,సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి):భారత దేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని  బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నేటి నుంచి గాంధీ జయంతి లాల్,

బహుదూర్ శాస్త్రి జయంతి ఆయన అక్టోబర్ రెండు వరకు సేవాపక్ష కార్యక్రమాలను జిల్లా కన్వీనర్ కనుకుంట్ల రంజిత్, కో కన్వీనర్లు కర్నే రవీందర్, కొంతం సంగీత్ ల సహకారం తో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.  బుధవారం పలుచోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదానానికి యువత ముందుకు రావడం ఆనందంగా ఉందని రవికుమార్ వెల్లడించారు. 

నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కాజీపేట చౌరస్తాలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు చిర్ర  నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో పండు పంపిణీ చేయడం జరిగింది.  జిల్లా నాయకులు పోనగొటి వెంకటరావు మాట్లాడురు. అనంతరం బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా నాయకులు చాంద్ పాషా, జాఫర్, దళిత మోర్చా అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు తక్కలపల్లి నిఖిల్ రావు, గొర్రె రాజు, పోలు శ్యామ్, గడ్డం భరత్, మొగిలి,సతీష్, భాస్కర్, ఈశ్వర్,పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మహాదేవపూర్ మండల కేంద్రంలో..

మహదేవపూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

అనంతరం  సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బిజెపి మండల శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 75 వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని, లింగంపల్లి వంశీధర్ రావు,శ్రవణ్ కుమార్, పూర్ణచందర్, సంతోష్, బాల్ రెడ్డి, ఐలయ్య, వెంకటేష్, రాకేష్, మనోజ్, సంజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.