3 September, 2026 | 12:44 PM

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సంబరం

03-09-2026 | 12:12pm

కేసముద్రం,(విజయక్రాంతి): ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) చేసిన అప్పులను తీర్చుకుంటూ, ప్రజా సంక్షేమం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్(Kesamudram Agricultural Market Chairman) గంట సంజీవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం కేసముద్రం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో(Agricultural Market Yard) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరం నిర్వహించారు. వెయ్యి రోజుల ప్రజా పాలన ప్రతి ఒక్కరికి మేలు చేసిందని, సంబరాలు నిర్వహించి టపాసులు కాల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కేసముద్రం మండల వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.