కాశ్మీరీ పండిట్ల హిట్ లిస్ట్ ఎపిసోడ్ @పొలిటికల్ టర్న్
- మాజీ సీఎం ఫరూక్ సంచలన ఆరోపణలు
- పండిట్లకు బెదిరింపుల వెనుక పెద్ద కుట్ర
- పండిట్లకే బెదిరింపులెందుకు?
- పండిట్ల హిట్ లిస్ట్ ఎపిసోడ్ @ పొలిటికల్ టర్న్
న్యూఢిల్లీ: కాశ్మీరీ పండిట్ల హిట్ లిస్ట్ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. పండింట్ల బెదిరింపులపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా(Former CM Farooq ) సంచలన ఆరోపణలు చేశారు. పండిట్లకు బెదిరింపుల వెనుక పెద్ద కుట్ర ఉందని సూచించారు. జమ్మూకశ్మీర్ కు(Jammu and Kashmir) రాష్ట్ర హోదా రాకుండా అడ్డుకునేందుకు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పండిట్లకే(Kashmiri Pandits) బెదిరింపులెందుకు? హిందూ అధికారులకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. డీజీపీ నుంచి ఎస్పీల వరకు అందరూ బయటివారే అన్నారు. అయినా వారంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్(Lieutenant Governor's Control) లోనే పోలీసులుంటే బెదిరింపులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.






