18-09-2025 07:54:27 PM
కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాష ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజా నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద అయన చిత్రపటం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు, అరటి పండ్లు పంపిణి చేశారు.
పదవి ఉన్న లేకున్న నిత్యం ప్రజల సమస్యలపై స్పదింస్తూ వారి సమస్యలు తీరుస్తు, నియోజకవర్గ అభివృద్ధితో పాటు కోనరావుపేట మండలంను అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపిస్తున్నడని 10 ఏళ్ళు కేసీఆర్ పేదలకు ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆది శ్రీనివాస్ 562 ఇందిరమ్మ ఇళ్లు మండలానికి మంజూరు చేశాడని, ఆరోగ్యం విషయంలో ఎల్ ఓ సి లు, సిఎం సహాయనిది రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అనేక పథకాలు అమలులో భాగస్తుడైయాడని, ఎమ్మెల్యే గా గెలిచిన నుండి ఒక్క సెలవు పట్టకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజానాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు కోరారు.