2 July, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

ఎల్పీజీ గ్యాస్ స్టాక్ కొరత లేదు

20-03-2026 02:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్ లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ గ్యాస్ సిలిండర్ ల సరఫరాపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలు తమ అవసరాలకు సిలిండర్ లు బుక్ చేసుకున్న నిర్ణీత గడువులోపు డోర్ డెలివరీ చేయబడతాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు వెళ్లవలసిన పనిలేదని అన్నారు. ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదని, గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు ఎట్టి పరిస్థితులలో నమ్మరాదని కలెక్టర్ ఆ ప్రకటన ద్వారా కోరారు.