18-09-2025 07:56:11 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి సాంఘిక సంక్షేమ శాఖల బాలుర వసతి గృహనికీ నూతన భవనం మంజూరు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సజీవన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుందని దీంతో విద్యార్థులను బీసీ వసతి గృహానికి తరలించడం జరిగిందన్నారు. బీసీ వసతి గృహం పెచ్చులు ఉడి విద్యార్థులపై పడుతున్నాయని దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుతున్నారని తెలిపారు. ఉన్నత అధికారులు స్పందించి ఎస్సీ వసతి గృహానికి నూతన భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.